టీడీపీలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

- వైసీపీకి గుడ్ బై చెబుతున్న నీలకంఠంనాయుడు
- కళా వెంకట్రావుతో చర్చలు సఫలం
- బొత్సకు సన్నిహితుడు నీలకంఠంనాయుడు
చీపురుపల్లి నియోజకవర్గం నుంచి రెండు సార్లు, ఎచ్చెర్ల నుంచి ఒకసారి నీలకంఠంనాయుడు పోటీ చేశారు. 2009లో ఎచ్చెర్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ లభించలేదు. మరోవైపు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు నీలకంఠంనాయుడు అత్యంత సన్నిహితుడు.