Anti Bribary: సెక్స్ ప్రలోభాలకు లొంగితే నేరమే... ఇకపై ఏడేళ్ల జైలు శిక్ష, రాష్ట్రపతి సంతకం!

  • మూడు దశాబ్దాల నాటి అవినీతి నిరోధక చట్టం
  • చట్ట సవరణతో మరింత శక్తిమంతం
  • ప్రయోజనాన్ని ఏ రూపంలో పొందినా నేరమే

లైంగిక సేవలను లంచంగా కోరుకోవడం, ఎవరైనా వాటిని ఆఫర్ చేస్తే, అంగీకరించి వారికి అవసరమైన పనులు చేసిపెట్టడం వంటివి ఇకపై నేరాలే. అవినీతి నిరోధక సవరణ చట్టం-2018 ప్రకారం, అనుచితమైన ప్రయోజనాలు పొందడం శిక్షార్హమైన నేరం. దీనికి గరిష్ఠంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఈ చట్టంపై ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం కూడా పెట్టేశారు.

మూడు దశాబ్దాల నాటి అవినీతి నిరోధక చట్టాన్ని మరింత శక్తిమంతం చేస్తున్న ఈ సవరణల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు లంచంగా లైంగిక సేవలను పొందినా, విలాసవంతమైన క్లబ్బుల్లో సభ్యత్వాలు, ఖరీదైన ఆతిథ్యాలు పొందినా కేసులను ఎదుర్కోవాల్సివుంటుంది. బంధువులు, స్నేహితులు, ఇతరులకు సాయం చేసి, వారి నుంచి అనుచిత ప్రయోజనం పొందినా, ఈ చట్టం ప్రకారం శిక్షార్హులే. విహార యాత్రలకు వెళ్లేందుకు టికెట్లను బహుమతిగా పొందినా నేరమే అవుతుందని, 'అనుచిత ప్రయోజనం' అన్న పదం రాబోయే రోజుల్లో విస్తృత రూపం సంతరించుకుని చట్టం అమలుకు దోహదపడుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.

More Telugu News