Pawan Kalyan: తెలంగాణ ఎన్నికల దృష్ట్యా 'ప్యాక్'తో చర్చించిన పవన్ కల్యాణ్

  • ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • సీపీఎం నేతలను తదుపరి చర్చలకు ఆహ్వానిస్తాం
  • మంగళవారం లేదా బుధవారం ఈ చర్చలకు అవకాశం

తెలంగాణ శాసనసభకు త్వరలో జరగనున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్)తో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశం జరిగింది. తెలంగాణ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై పవన్ చర్చించినట్టు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

సీపీఎం తెలంగాణ శాఖ నేతలు, ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో జరిపిన చర్చల వివరాలను పవన్ కల్యాణ్ కి ప్యాక్ సభ్యులు వివరించారు. ఆ చర్చలు సామరస్యంగా, ఫలవంతంగా జరగడంతో తదుపరి చర్చలు పవన్ కల్యాణ్  సమక్షంలో జరగాలని ప్యాక్ సభ్యులు కోరారని, అందుకు, ఆయన అంగీకరించినట్టు పేర్కొన్నారు. సీపీఎం నేతలను తదుపరి చర్చలకు ఆహ్వానించాల్సిందిగా రాజకీయ వ్యవహారాల కమిటీకి సూచించారు. మంగళవారం లేదా బుధవారం సీపీఎం నేతలతో సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News