Mac Miller: అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ మ్యాక్‌ మిల్లర్ మృతి : డ్రగ్స్‌ ఎఫెక్ట్‌

  • ఓవర్‌ డోస్‌తో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయకుడు
  • కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పతిక్రి తరలించేలోగానే మృతి
  • గత కొన్ని రోజులుగా వరుస సమస్యలతో బాధపడుతున్న ర్యాపర్‌

చిన్న వయసులోనే ఉన్నత స్థానాన్ని అధిరోహించి కోట్లాది మంది సంగీత అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్ మ్యాక్‌ మిల్లర్  (26) మృతి చెందాడు. డ్రగ్స్‌ మోతాదు అధికం కావడం వల్లే అతను మృతి చెందినట్లు భావిస్తున్నారు. ప్రియురాలితో బ్రేకప్‌...హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్టు...గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న సమస్యలతో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఈ ర్యాపర్‌ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. లాస్‌ ఏంజిల్స్‌లోని సొంత ఇంటిలో ఆపస్మారక స్థితిలో పడివున్న మ్యాక్‌ మిల్లర్ ను కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

డ్రగ్స్‌ మత్తులో గుండెపోటు రావడంతో అతను చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ప్రియురాలు అరియానా గ్రాండే తన నుంచి విడిపోయి అమెరికా కమేడియన్‌ పిటె డేవిడ్సన్‌తో నిశ్చితార్థం చేసుకోవడాన్ని మ్యాక్‌ మిల్లర్   తట్టుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 2012 నుంచి గ్రాండేతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన మ్యాక్‌ విభేదాల కారణంగా 2017లో ఆమెతో విడిపోయాడు. అప్పటి నుంచి నిరాశలో కూరుకుపోయాడు. ఇటీవల తన చివరి ఇంటర్వ్యూలో కూడా తాను డిప్రెషన్‌లో ఉన్నట్లు అంగీకరించాడు.

More Telugu News