TRS: శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే కిందకొస్తాం.. రేడియో టవర్ ఎక్కిన ఇద్దరు యువకులు!

  • ఎల్బీనగర్ చింతల్ కుంటలో ఘటన
  • టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్
  • గతంలో పాలకుర్తి టికెట్ కోరిన శంకరమ్మ

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతూ ఇద్దరు యువకులు ఈ రోజు రేడియో టవర్ ఎక్కారు. ఎల్బీనగర్ లోని చింతల్ కుంటలో ఉన్న రేడియో టవర్ ను ఎక్కిన యువకులు శంకరమ్మకు టికెట్ ఇస్తేనే కిందకు దిగుతామని స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు గంటల నుంచి ఇద్దరు యువకులు రేడియో టవర్ పైనే ఉండటంతో ఇక్కడ స్థానికులు భారీగా గుమిగూడారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను 2003, నవంబర్ 29న అరెస్ట్ చేయడంతో నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి డిసెంబర్ 3న ఎల్బీనగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, లేకపొతే తన కొడుకు చనిపోయిన చోటే తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కొన్నిరోజుల క్రితం సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు యువకులు చింతల్ కుంటలోని రేడియో టవర్ ఎక్కడం గమనార్హం.

More Telugu News