Lalu Yadav: పంతం నెగ్గించుకున్న లాలు ప్రసాద్ యాదవ్.. ఏసీ వార్డుకు తరలింపు!

  • రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలు
  • దోమలు, కుక్కలు నిద్రపోనివ్వడం లేదని ఆవేదన
  • అధికారుల అనుమతితో ఏసీ వార్డుకు మార్పు

ఆర్జేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ మొత్తానికి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయనను సాధారణ వార్డు నుంచి ఎయిర్ కండీషన్డ్ వార్డుకు మార్చారు. అయితే, ఇది పేయింగ్ వార్డు కావడంతో రోజుకు  వెయ్యి రూపాయల చొప్పున ఆయన చెల్లించాల్సి ఉంటుంది.

తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, బెయిలును మరికొంత కాలం పొడిగించాలని లాలు పెట్టుకున్న దరఖాస్తును జార్ఖండ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆగస్టు 30న రిమ్స్‌లో చేర్చారు. అయితే, తానున్న వార్డులో దోమలు కుడుతున్నాయని, కుక్కలు మొరుగుతున్నాయని, నిద్రపట్టడం లేదని లాలు వాపోయారు. తనను వేరే వార్డుకు మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. బ్రిస్రా ముండా జైలు సూపరింటెండెంట్.. లాలు అభ్యర్థనను అంగీకరించారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది లాలును ఎయిర్ కండీషన్డ్ పేయింగ్ వార్డుకు మార్చారు.

More Telugu News