kcr: అయ్యా, అసెంబ్లీని రద్దు చేయండి: గవర్నర్ ను కోరిన కేసీఆర్

  • గవర్నర్ నరసింహన్ ను కలసిన కేసీఆర్, మంత్రులు
  • అసెంబ్లీని రద్దు చేయాలంటూ విన్నపం
  • కేబినెట్ తీర్మానం సమర్పణ

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ నరసింహన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు అందజేశారు. కేబినెట్ నిర్ణయం మేరకు అసెంబ్లీని రద్దుచేయాలని విన్నవించారు. దీంతో, అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.

తదనంతరం అసెంబ్లీ రద్దు నోటిఫికేషన్ రాజ్ భవన్ నుంచి ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి వెళతాయి. అసెంబ్లీ సెక్రటరీ నుంచి ప్రకటన వెలువడగానే అసెంబ్లీ రద్దవుతుంది. అనంతరం ముందస్తు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం తన కార్యాచరణను మొదలుపెడుతుంది. అసెంబ్లీ రద్దయిన వెంటనే ఎమ్మెల్యేలంతా మాజీలు అయిపోతారు. ప్రస్తుతం గవర్నర్ తో కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది.

More Telugu News