bandh: అగ్ర కులాల 'భారత్ బంద్' సందర్భంగా ఉత్తరాదిలో ఉద్రిక్తత.. పలు రైళ్లు నిలిపివేత!

  • ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఇటీవల చేసిన సవరణపై నిరసన
  • యూపీ, మధ్యప్రదేశ్ లలో దిష్టిబొమ్మల దహనం
  • బీహార్ లో పలు రైళ్లను నిలిపివేసిన నిరసనకారులు

ఈ రోజు భారత్ బంద్ సందర్భంగా ఉత్తరాదిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఇటీవల చేసిన సవరణను నిరసిస్తూ అగ్రకులాలకు చెందిన వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ బంద్ కొనసాగుతోంది. యూపీ, మధ్యప్రదేశ్ లలో దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీహార్ లో నిరసనకారులు పలు రైళ్లను నిలిపివేశారు. దర్భంగా, ముంగర్, అర్రాలలో ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. ఆయా రాష్ట్రాలలో ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, పెట్రోల్ బంక్స్ మూసివేశారు. పలు ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. కాగా, మధ్యప్రదేశ్ లో భారత్ బంద్ ప్రభావం అధికంగా ఉందని, 35 జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News