Swamy Paripurnananda: కాషాయ పార్టీలోకి మరో యోగి.. బీజేపీలోకి స్వామి పరిపూర్ణానంద?

  • స్వామిని బీజేపీలోకి లాగే ప్రయత్నంలో నేతలు
  • తెలంగాణలో మజ్లిస్‌కు అడ్డుకట్ట వేయగల శక్తి ఆయన సొంతం
  • పార్టీ సమావేశంలో చర్చ

బీజేపీలోకి మరో యోగి రాబోతున్నారా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల నగర బహిష్కరణకు గురై మొన్ననే తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన స్వామి పరిపూర్ణానందకు కాషాయ కండువా కప్పడం ద్వారా తెలంగాణలో మజ్లిస్ దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చని బీజేపీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లా హిందుత్వ కార్డును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగే సమ్మోహనశక్తి పరిపూర్ణానందకు ఉందని ఆరెస్సెస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. పరిపూర్ణానంద స్వామిని పార్టీలోకి ఆహ్వానించడంపై ఇటీవల మోహన్ భగవత్ నేతృత్వంలో జరిగిన సమావేశంలోనూ చర్చించినట్టు తెలుస్తోంది.  

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ శ్రీరాముడిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నిత అంశంపై వాతావరణం వేడెక్కడంతో, పోలీసులు స్పందించి తొలుత కత్తి మహేశ్‌ను, ఆ తర్వాత పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించారు. 55 రోజుల బహిష్కరణ తర్వాత స్వామి భారీ ర్యాలీతో రెండు రోజుల క్రితం నగరంలో అడుగుపెట్టారు.

More Telugu News