Tech-News: అద్భుత ఫీచర్ లతో షియోమీ 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లు విడుదల!

  • రెడ్‌మీ 6ఎ, రెడ్‌మీ 6, రెడ్‌మీ 6 ప్రో విడుదల
  • ఈనెల 10న రెడ్‌మీ 6 మొదటి సేల్ 
  • ఈనెల 11న రెడ్‌మీ 6ప్రో మొదటి సేల్ 
  • ఈనెల 19న రెడ్‌మీ 6ఎ మొదటి సేల్

షియోమీ సంస్థ నుండి మూడు స్మార్ట్ ఫోన్ లు భారత మార్కెట్లో తాజాగా విడుదల అయ్యాయి. గతంలో చైనాలో విడుదల చేసిన సిరీస్ ప్రకారంగానే భారత్ లో కూడా రెడ్ మీ 6, 6 ప్రో, 6ఏ పేరిట నూతన స్మార్ట్ ఫోన్ లని తాజాగా విడుదల చేసింది. రెడ్‌మీ 6 ఈనెల 10న, రెడ్‌మీ 6ప్రో ఈనెల 11న, రెడ్‌మీ 6ఎ ఈనెల 19న విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరలు, ప్రత్యేకతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

రెడ్‌మీ 6ఎ ధరలు:

  • 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్: రూ.5999
  • 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.6999

రెడ్‌మీ 6 ధరలు:

  • 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.7999
  • 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్: రూ.9499

రెడ్‌మీ 6 ప్రో ధరలు:

  • 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.10999
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్: రూ.12999

షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు:

  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హీలియో ఏ 22 ప్రాసెసర్
  • 5.45" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు) 
  • 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు:

  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హీలియో పీ 22 ప్రాసెసర్
  • 5.45" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • 12/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్,ఫేస్ అన్ లాక్
  •  3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ 6 ప్రో ఫీచర్లు:

  • 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 5.84" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
  • 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ ( 256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
  • 12/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News