paruchuri: మా ఇంటి నుంచి వచ్చే భోజనం అంటే రావు గోపాలరావుగారికి చాలా ఇష్టం!: పరుచూరి గోపాలకృష్ణ

  • రావు గోపాలరావు అద్భుతమైన నటుడు  
  • మా ఆవిడ రకరకాల కూరలు, పచ్చళ్లతో క్యారియర్ పంపించేది.
  • ఆ కూరలకి హిట్ సినిమాల పేర్లు పెట్టేవారు    

ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా 'తన పరుచూరి పలుకులు' కార్యక్రమంలో రావు గోపాలరావు గురించి ప్రస్తావించారు. "రావు గోపాలరావుగారు అద్భుతమైన నటులు .. ఆయన నాకెంతో ఆత్మీయులు. ఆ రోజుల్లో ఎవరింటి దగ్గర నుంచి వాళ్లకి లొకేషన్ కి క్యారియర్లు వచ్చేవి. మా ఆవిడ రకరకాల కూరలు .. పచ్చళ్లతో క్యారియర్ పంపించేది.

ఒకసారి మా ఇంటి నుంచి వచ్చిన భోజనం చేసిన రావు గోపాలరావుగారు, మరుసటి రోజు నుంచి క్యారియర్లు రాగానే, 'గోపాలకృష్ణ గారి క్యారియర్ ఎవరు ముట్టుకున్నా నామీద ఒట్టే ..' అంటూ నా వైపు తిరిగి 'మీతో సహా' అనేవారు. 'సార్ అది నా ఇంటి నుంచి వచ్చిన క్యారియర్' అని నవ్వితే, 'నేను ముందుగా పెట్టుకున్న తరువాతనే మీకు' అనేవారు. అన్నిరకాల కూరలు .. పచ్చళ్లు వడ్డించుకుని తింటూ 'ఇది జస్టీస్ చౌదరి .. ఇది కొండవీటి సింహం .. ఇది అల్లూరి సీతారామరాజు .. ఇది ఖైదీ అంటూ ఆ కూరలకు సూపర్ హిట్ సినిమాల పేర్లు పెట్టేవారు .. ఆయనతో వున్న అనుబంధాన్ని ఈ జీవితంలో మరిచిపోలేను" అంటూ నవ్వేశారు. 

More Telugu News