దొంగతనం చేశాడంటూ పిల్లాడిని కొట్టి చంపేశారు!

Wed, Sep 05, 2018, 12:30 PM
  • ఢిల్లీలోని ముకుంద్ పూర్ లో ఘటన
  • దొంగతనానికి వచ్చిన పిల్లాడు
  • స్తంభానికి కట్టేసి చావబాదిన స్థానికులు
దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తూ దొరికిన ఓ పిల్లాడిని(16) కట్టేసి చావగొట్టడంతో ఆ దెబ్బలు తాళలేక ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఢిల్లీలోని ముకుంద్ పూర్లో ఉంటున్న ఓ బాలుడు మరో ఇద్దరితో కలసి మంగళవారం రాత్రి ఓ ఇంట్లో చోరీచేసేందుకు యత్నించాడు. ఈ సందర్భంగా ఈ ఇంట్లో ఉన్నవారు ఈ పిల్లాడిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఇది తెలుసుకుని అక్కడకు చేరుకున్న స్థానికులు రాత్రంతా ఈ బాలుడిపై విచక్షణారహితంగా దాడిచేశారు. అనంతరం ఉదయాన్నే రోడ్డుపై పడేశారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లాడి బంధువులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement