nani: నటుడిగా 10 వసంతాలు పూర్తి చేసుకున్న నాని

  • ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి
  • తొలిచిత్రంగా 'అష్టా చమ్మా'
  • వరుస విజయాలతో నేచురల్ స్టార్ గా    

సీనియర్ హీరోల వారసులు .. స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న సమయంలో, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి నిలదొక్కుకోవడం అంత తేలికైన పనేంకాదు. అదృష్టం కలిసొచ్చి అలాంటి అవకాశం వచ్చినా, ఒక్కో మెట్టూ పైకెక్కుతూ వెళ్లడం మరింత కష్టం. కొత్తగా వస్తోన్న హీరోల పోటీని కూడా తట్టుకుంటూ, సినిమా .. సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్లడం కూడా అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు.

అలాంటి అనితరసాధ్యమైన ఫీట్లను నాని చాలా తేలికగా చేసుకుంటూ .. నేచురల్ స్టార్ అనిపించుకుంటూ వెళుతున్నాడు. నాని తొలి చిత్రమైన 'అష్టా చమ్మా' 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదలైంది. అలా ఈ రోజుతో నాని నటుడిగా 10 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఈ పదేళ్లలో ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన కథలను .. విలక్షణమైన పాత్రలను చేసి శభాష్ అనిపించుకున్నాడు. వరుస విజయాలతో స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యంలోను .. ఆలోచనలోను పడేసినవాడాయన. 'బిగ్ బాస్ 2' ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి మరింత చేరువైన ఆయన, కథా కథనాలు .. పాత్రల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం విశేషం.   

More Telugu News