ముగింపు దశకి చేరుకున్న మెగా హీరో మూవీ షూటింగ్

05-09-2018 Wed 10:41
  • సంకల్ప్ రెడ్డి తాజా చిత్రంగా 'అంతరిక్షం'
  • చివరి షెడ్యూల్ కి సన్నాహాలు 
  • డిసెంబర్ 21వ తేదీన విడుదల  
రానాతో 'ఘాజీ' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి సక్సెస్ ను సాధించాడు. సముద్రం నేపథ్యంలో ఆ సినిమాను తెరకెక్కించి శభాష్ అనిపించుకున్న ఆయన, ఈసారి ఆకాశం నేపథ్యంలో 'అంతరిక్షం' సినిమాను రూపొందిస్తున్నాడు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

రాజీవ్ రెడ్డి .. సాయిబాబు నిర్మిస్తోన్న ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి చివరి షెడ్యూల్ షూటింగును జరుపుకోనుంది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా చిత్రీకరించనున్నారు. లావణ్య త్రిపాఠి .. అదితీరావు హైదరి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనీ, తన కెరియర్లోనే వైవిధ్యభరితమైనదిగా నిలిచిపోతుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు.