Hyderabad: హైదరాబాద్ మెట్రో అరుదైన రికార్డు.. 2 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చిన రైళ్లు!

  • గతేడాది అందుబాటులోకి వచ్చిన మెట్రో
  • మెట్రోకు విపరీతమైన ఆదరణ
  • రికార్డుస్థాయిలో ప్రయాణికుల చేరవేత

గతేడాది నవంబరు 29న భాగ్యనగరవాసులకు అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు అరుదైన రికార్డు అందుకుంది. సేవలు ప్రారంభమైన పది నెలల కాలంలోనే ఏకంగా రెండు కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ప్రస్తుతం 30 కిలోమీటర్ల పరిధిలోనే నడుస్తున్న మెట్రో ఇంత తక్కువ మార్గంలోనే 2 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చడం ఓ రికార్డని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అమీర్‌పేట-ఎల్‌బీ నగర్ మార్గంలో కనుక సేవలు ప్రారంభం అయితే మరింత ఆదరణ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్టేషన్లలో ఏర్పాటు చేసిన తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలను ప్రయాణికులు ఉచితంగా వినియోగించుకోవచ్చని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

More Telugu News