kcr: తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారు?

  • ఈ నెల 6న అసెంబ్లీ రద్దుకు సీఎం కేసీఆర్ నిర్ణయం
  • ఆరోజు ఉదయం 6.45 గంటలకు కేబినెట్ సమావేశం
  • ఆ తర్వాత గవర్నర్ ను కలిసే అవకాశం

‘తెలంగాణ’లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆరో తేదీ ఉదయం 6.45 గంటలకు తెలంగాణ మంత్రి వర్గం సమావేశమై అసెంబ్లీ రద్దుకి సిఫార్సు చేయనుందని తెలుస్తోంది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ ని కలిసి అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి లేఖ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

More Telugu News