kolkata: కోల్ కతాలో కుప్పకూలిన మజర్ హట్ వంతెన.. పలువురికి గాయాలు!

  • దక్షిణ కోల్ కతాలో ఘోర ప్రమాదం
  • రైల్వే ట్రాక్ పై కూలిన మజర్ హట్ వంతెన 
  • శిథిలాల కింద చిక్కుకున్న పలువురు 

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ కోల్ కతాలోని పురాతన మజర్ హట్ వంతెన రైల్వే ట్రాక్ పై కుప్పకూలింది. బస్సులు, కార్లు వంతెనపై పయనిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ ఘటనపై విచారణకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు.

More Telugu News