యూఎస్ ఓపెన్ లో పెను సంచలనం... అనామకుడి చేతిలో ఫెదరర్ ఓటమి!

04-09-2018 Tue 12:31
  • అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన జాన్ మిల్ మాన్
  • నాలుగు సెట్ల మ్యాచ్ లో ఫెదరర్ ఓటమి
  • యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన స్విస్ స్టార్
ఐదు సార్లు యూఎస్ ఓపెన్ విజేత, స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ కు చుక్కెదురైంది. యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ పోటీల్లో భాగంగా జరిగిన పోటీల్లో ఓ అనామకుడి చేతిలో ఓటమి పాలయ్యాడు ఫెదరర్. ఆస్ట్రేలియాకు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు జాన్ మిల్ మాన్, ఫెదరర్ ను నాలుగు సెట్లు సాగిన మ్యాచ్ లో ఓడించి సరికొత్త స్టార్ గా నిలిచాడు. తొలి సెట్ ను 3-6 తేడాతో కైవసం చేసుకున్న ఫెదరర్, ఆపై మిల్ మాన్ థాటికి తలొగ్గాడు. వరుసగా మూడు సెట్లను 7-5-, 7-6, 7-6 తేడాతో మిల్ మాన్ గెలిచాడు. క్వార్టర్ ఫైనల్స్ లో మిల్ మాన్, నోవాక్‌ జకోవిచ్‌ తో తలపడనున్నాడు.