shivakrishna: అలా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాను: సీనియర్ నటుడు శివకృష్ణ

  • సినిమాల పట్ల ఆసక్తి ఉండేది 
  • అందువల్లనే హైదరాబాద్ వచ్చాను 
  • నటుడిగా ..నిర్మాతగా ప్రయత్నాలు చేశాను

తెలుగు తెరపై వైవిధ్యభరితమైన కథా చిత్రాల్లో నటించి మెప్పించిన నిన్నటితరం నటుల్లో 'శివకృష్ణ' ఒకరు. ఉద్యమ స్ఫూర్తి .. సామాజిక చైతన్యంతో ముడిపడిన కథా చిత్రాల్లో ఆయన ఎక్కువగా నటించారు. ఆవేశం .. తిరుగుబాటు లక్షణంగా గల పాత్రల్లో ఆయన ప్రేక్షకుల నుంచి ఎక్కువ మార్కులు కొట్టేశారు. అలాంటి శివకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలను పూర్తిచేసుకున్న సందర్భంగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

"మా నాన్నగారికి ఇండస్త్రీలు ఉండేవి .. వాటి వ్యవహారాలు చూసుకోమని ఆయన చెప్పారు. కానీ నా దృష్టి సినిమాలపై ఉండేది. అప్పుడు మాకు తెలిసిన ఒకాయన నన్ను హైదరాబాద్ కి తీసుకొచ్చి, వేజెళ్ల సత్యనారాయణ .. పరుచూరి వెంకటేశ్వరరావులను పరిచయం చేశారు. రెండేళ్లపాటు వాళ్లతో కలిసి 'రవీంద్రభారతి'లో నాటకాలు చూడటానికి వెళుతూ ఒక అవగాహనకి వచ్చాను. తర్వాత కొంతమంది భాగస్వాములను కలుపుకుని 'చలిచీమలు' సినిమా నిర్మించాను .. అందులో చిన్నవేషం కూడా వేశాను. ఆ తరువాత సొంతంగా తీసిన 'మరోమలుపు' నటుడిగా నా కెరియర్ ను మలుపుతిప్పింది" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News