Congress: మీ ఫేస్‌బుక్ పేజీకి 15 వేల లైక్స్ ఉన్నాయా.. అయితే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థి మీరే: అర్హతలు వెల్లడించిన కాంగ్రెస్ కమిటీ

  • సోషల్ మీడియాపై పట్టున్న వారు టికెట్‌కు అర్హులు
  • ట్విట్టర్‌లో ఫాలోవర్లు, వాట్సాప్ గ్రూపులు తప్పనిసరి
  • గైడ్ లైన్స్ విడుదల చేసిన కాంగ్రెస్

మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వెతుకులాట ప్రారంభించింది. టికెట్ ఆశించే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలకు సంబంధించి కొన్ని నిబంధనలు విధించింది. ఈ మేరకు ఆశావహులకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లేఖలు రాసింది.

దాని ప్రకారం.. టికెట్ ఆశించే నేతలకు సోషల్ మీడియాపై గట్టి పట్టు ఉండాలి. ఆశావహులకు ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఇదే. తమ సొంత ఫేస్‌బుక్ ఖాతాకు కనీసం 15 వేల లైకులు ఉండాలి. ట్విట్టర్‌లో 5వేల మంది ఫాలోవర్లు ఉంటే ఇక తిరుగులేనట్టే. అలాగే, బూత్‌లెవల్ లోనూ వాట్సాప్ గ్రూపులు నిర్వహించాలి. కాంగ్రెస్ కమిటీ చేసే ప్రతీ ట్వీట్‌ను రీట్వీట్ చేయాలి. టికెట్ ఆశించేవారు తప్పని సరిగా ఈ నిబంధనలు పాటించాలని లేఖలో సూచించింది. ఈ అర్హతలు ఉన్న వారు టికెట్‌కు అర్హులని కాంగ్రెస్ కమిటీ స్పష్టం చేసింది.

More Telugu News