stock market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • చివరి గంటల్లో భారీగా అమ్మకాలు
  • 332 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • నిఫ్టీకి 98 పాయింట్ల నష్టం 

ఈరోజు స్టాక్ మార్కెట్లు ఊహించని రీతిలో కుప్పకూలాయి. చివరి గంటల్లో అమ్మకాల జోరు వెల్లువెత్తడంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 332 పాయింట్లు దిగజారి 38,312 వద్ద స్థిరపడగా, నిఫ్టీ  98 పాయింట్ల నష్టంతో 11,582 పాయింట్ల వద్ద ముగిశాయి.

కాగా, రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, ఐషర్ మోటార్స్, టైటాన్, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థల షేర్లు లాభపడగా, ఐటీసీ షేర్లు, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థల షేర్లు నష్టపోయాయి. ఇదిలా ఉండగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ రెండేళ్ల గరిష్ఠానికి చేరిందన్న వార్తలతో ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కానీ, చివరి గంటల్లో అమ్మకాలు భారీగా జరగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

More Telugu News