6న టీడీపీలో చేరనున్న కొండ్రు మురళి.. ముహూర్తం ఖరారు

03-09-2018 Mon 08:21
  • హరికృష్ణ మరణంతో చేరిక వాయిదా
  • ఆరో తేదీన సాయంత్రం ఆరు గంటలకు ముహూర్తం
  • పెద్ద ఎత్తున అమరావతికి తరలిరానున్న శ్రేణులు

ఏపీ మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ ఈ నెల 6న టీడీపీలో చేరనున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆరో తేదీన సాయంత్రం ఆరు గంటలకు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. నిజానికి ఆయన ఆగస్టు 31నే టీడీపీలో చేరాల్సి ఉంది. అయితే, హరికృష్ణ మృతితో అది వాయిదా పడింది.

టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నప్పటి నుంచి తన నిజయోకవర్గ ప్రజలు, కార్యకర్తలతో సమావేశమైన కొండ్రు మురళి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తాను టీడీపీలో చేరబోతున్నానని, ఇప్పటి వరకు సహకరించినట్టుగానే ఇకపై కూడా సహకరించాలని కోరారు. టీడీపీలో చేరుతున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి తనతోపాటు అందరూ కలిసి రావాలని కోరారు.