‘గురుశ్రీ’ పురస్కారం అందుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం!

Mon, Sep 03, 2018, 06:53 AM
  • శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్  కృష్ణాష్టమి వేడుకలు
  • హాస్యబ్రహ్మకు పురస్కారం, స్వర్ణ కంకణ ధారణ
  • త్రిమూర్తులను గొప్పగా అభివర్ణించిన బ్రహ్మానందం
టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బ్రహానందం ‘గురుశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో బ్రహ్మానందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గురుశ్రీ పురస్కారాన్ని అందించిన అసోసియేషన్ ‘హాస్యబ్రహ్మ’కు స్వర్ణకంకణ ధారణ చేసింది.  ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఆదిపరాశక్తి కుమారులే త్రిమూర్తులని పేర్కొన్నారు. వీరిలో సృష్టించేవాడు (జనరేటర్) బ్రహ్మ అయితే, నడిపించే వాడు (ఆర్గనైజర్) విష్ణువని, ఇక తీసుకెళ్లేవాడు (డిస్ట్రాయర్) శివుడని, ఈ ముగ్గురినీ కలిపి దేవుడు (జీవోడీ-గాడ్) అంటారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖలు పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad