kcr: ‘తెలంగాణ’లో కన్నా ఏపీలోనే సంక్షేమం వేగంగా జరుగుతోంది: రేవంత్ రెడ్డి

  • ఏపీలోనే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ 
  • ‘తెలంగాణ’లో రుణమాఫీ ఎందుకు చేయలేదు?
  • కేసీఆర్ పీడ విరగడైతేనే తెలంగాణకి మేలు

తెలంగాణలో కన్నా ఏపీలో సంక్షేమం వేగంగా జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ప్రసంగంలో ఎటువంటి కొత్తదనం లేదని అన్నారు. గతంలో చెప్పిన విషయాలనే చెప్పారని అన్నారు. లోటుబడ్జెట్ లో ఉన్న ఏపీలో తెలంగాణలో కన్నా సంక్షేమ కార్యక్రమాలు అదనంగా జరుగుతున్నాయని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఒకేసారి లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తన కొడుకుకి పట్టం కట్టాలనుకుంటున్న కేసీఆర్ పీడ విరగడైతేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల, కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ వల్ల, నరేంద్ర మోదీకి లొంగిపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచుతున్నారని ఆరోపించారు.

More Telugu News