నాలుగో టెస్ట్: అర్ధశతకంతో ఆదుకున్న కోహ్లీ!

02-09-2018 Sun 20:00
  • 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • హాఫ్ సెంచరీతో ఆదుకున్న కోహ్లీ
  • 40 పరుగులతో అండగా ఉన్న రహానే

సౌథాంప్టన్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా కొనసాగుతోంది. 245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మూడు వికెట్లు టపటపా రాలిపోయాయి. శిఖర్ ధావన్ 17, కేఎల్ రాహుల్ డకౌట్, పుజారా 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.

22 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో రహానేతో కలసి కెప్టెన్ విరాట్ కోహ్లీ సమయోచితంగా ఆడుతూ... వికెట్ పడకుండా, నెమ్మదిగా స్కోరును పెంచాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 117 పరుగులు. కోహ్లీ 54 పరుగులు, రహానే 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే మరో 128 పరుగులు చేయాల్సి ఉంది.