ఎన్నికలకు ముందే కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తాం: సీఎం కేసీఆర్

- మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లివ్వకుంటే ఓట్లు అడగనని చెప్పా
- ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా చెప్పలేదు
- దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ
22 వేల గ్రామాలకు నీరు అందుతోందని, మరో 1500 గ్రామాలకు వారం పది రోజుల్లో తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లాలో 9 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చామని, వలసపోయిన పాలమూరు కూలీలు తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారని చెప్పారు. ఆర్థిక ప్రగతిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్ర వృద్ధి రేటు 17.83 శాతంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.