kcr: చేస్తావా? చస్తావా? చెప్పు నరేంద్ర మోదీ అని అడిగా: కేసీఆర్

  • జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర పడిన తర్వాత చాలా సంతోషించా
  • 95 శాతం ఉద్యోగాలు మన బిడ్డలకే
  • వేరే వాళ్లు ఉద్యోగాలు తన్నుకుపోయే పరిస్థితి ఉండదు

తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డానో, జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదముద్ర వేసిన తర్వాత కూడా అంతే సంతోషపడ్డానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇకపై తెలంగాణలోని ఉద్యోగాలు 95 శాతం మనకే వస్తాయని చెప్పారు. తెలంగాణ ప్రజలకు 95 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రధాని మోదీ ఊగిసలాడుతుంటే... తానే నేరుగా ఢిల్లీకి వెళ్లి 'చేస్తావా? చస్తావా? నరేంద్ర మోదీ చెప్పు' అని అడిగానని తెలిపారు. మా ఉద్యోగాలు మా హక్కు అని దాన్ని సాధించామని... రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా తెచ్చుకున్నామని చెప్పారు. ఇకపై తెలంగాణలో వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డలకే వస్తుంది తప్ప, వేరే వారు తన్నుకుపోయే పరిస్థితి ఉండదని తెలిపారు.

More Telugu News