GODRIGO DUTATE: అందమైన మహిళలు ఉన్నంతవరకూ రేప్ లు జరుగుతూనే ఉంటాయి!: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు

  • మనీలా సమావేశంలో నోరుజారిన నేత
  • దుమ్మెత్తిపోస్తున్న మహిళా సంఘాలు
  • గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన డ్యూటేర్టే

వివాదాలతో సహవాసం చేసే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటేర్టే అత్యాచారాలపై చెత్త వ్యాఖ్యలు చేశారు. అందమైన అమ్మాయిలు, మహిళలు ఉన్నంతవరకూ అత్యాచారాలు తగ్గవని వ్యాఖ్యానించాడు. రోడ్రిగో సొంత పట్టణం డవావోలో ఇటీవలి కాలంలో అత్యాచారాలు పెరిగాయన్న నివేదికపై ఆయన ఈ మేరకు స్పందించాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై అక్కడి మహిళా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

మనీలాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో డ్యూటేర్టే మాట్లాడుతూ..‘డవావో పట్టణంలో అత్యాచారాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. అందమైన యువతులు, మహిళలు ఎక్కువయ్యే కొద్దీ అత్యాచారాలు పెరుగుతూనే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ‘పురుషుడు కోరగానే ఏ మహిళ అయినా శృంగారానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. హా..హా..హా.. అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి’ అంటూ మరింతగా వ్యాఖ్యలు చేశారు.

రోడ్రిగో డ్యూటేర్టే ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2017లో ఓ సారి ఆయన మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక దాడులను తాను సహించబోననీ, కానీ విశ్వ సుందరి పోటీల్లో నెగ్గినవారిపై రేప్ జరిగితే తనకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఏడాది ఓ సమావేశంలో సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మార్షల్ లా సందర్భంగా మీరు ముగ్గురిని రేప్ చేసినా ఫర్వాలేదు. నేను చూసుకుంటాను’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

More Telugu News