dhanunjaya: ఆసక్తిని రేపుతోన్న వర్మ 'భైరవగీత' ట్రైలర్

  • వర్మ సమర్పణలో 'భైరవగీత'
  • సీమ నేపథ్యంలో సాగే ప్రేమకథ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

రామ్ గోపాల్ వర్మ సమర్పణలో .. సిద్ధార్థ దర్శకత్వంలో 'భైరవగీత' చిత్రం రూపొందింది. ధనుంజయ .. ఇర్రా జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సీమలోని ఒక గ్రామం .. ఆ గ్రామంలోని ఒక ప్రేమికుల జంట .. ఆ జంటను విడదీసేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నాలు .. వాళ్లను ధైర్యంగా ఆ ప్రేమికుడు ఎదుర్కోవడం ప్రధానంగా ఈ టీజర్ ను కట్ చేశారు.

"ఎవ్వరినీ ఇడిసి పెట్టొద్దూ .. ఏడిపిద్దాం .. ఒక్కొక్కణ్ణి చంటిపిల్లల్లా గుక్కపట్టి ఏడ్చేలా ఏడిపిద్దాం .. ఆళ్ల రక్తంతో ఈ సీమకి అభిషేకం చేద్దాం' అని కథానాయకుడు చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అభిషేక్ నామా .. భాస్కర్ రాశి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది.


More Telugu News