rarun sagar: జైనమత దిగంబర సాధువు తరుణ్ సాగర్ అస్తమయం.. మోదీ సంతాపం

  • ఢిల్లీలోని రాథాపురి ఆలయంలో తుదిశ్వాస విడిచిన తరుణ్ సాగర్
  • ఆయన బోధనలు స్ఫూర్తిదాయకమన్న మోదీ
  • 1967లో దిగంబర సాధువుగా మారిన తరుణ్ సాగర్

జైనమత దిగంబర సాధువు, ఆధ్యాత్మిక గురువు తరుణ్ సాగర్ పరమపదించారు. ఢిల్లీలోని రాథాపురి దేవాలయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కామెర్లతో పాటు మరికొన్ని రుగ్మతలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఈ సందర్భంగా ఆయన అస్తమయం పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.

సమాజానికి ఆయన చేసిన బోధనలను మర్చిపోలేమని అన్నారు. తరుణ్ సాగర్ బోధనలు దేశ ప్రజానీకానికి నిరంతరం స్ఫూర్తిని ఇస్తున్నాయని చెప్పారు. 1967 జూన్ 26న తరుణ్ సాగర్ దిగంబర జైన సాధువుగా మారారు. ఆయన అంత్యక్రియలు ఉత్తరప్రదేశ్ లోని మురాద్ నగర్ లో నిర్వహించనున్నారు. 

More Telugu News