తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన బస్సులు!

- సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై ఘటన
- రాంగ్ రూట్లో వచ్చిన బస్సు
- రోడ్డుపై స్తంభించిన ట్రాఫిక్
బెంగళూరు నుంచి సేలంకు ఓ బస్సు ఈ రోజు ఉదయం వస్తుండగా, సేలం నుంచి ధర్మపురికి రాంగ్ రూట్ లో వెళుతున్న బస్సు దీన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు సహా 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం కారణంగా రెండు బస్సుల్లో గాయపడిన 37 మందిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.