surya: వెనక్కి తగ్గిన సూర్య .. విజయ్ కి పోటీ లేనట్టే!

  • సూర్య కథానాయకుడిగా 'ఎన్జీకే'
  • విజయ్ హీరోగా 'సర్కార్' 
  • సోలో రిలీజ్ పై దృష్టి పెట్టిన సూర్య    

తమిళనాట ఇటు సూర్యకి .. అటు విజయ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. ఈ ఇద్దరిలో ఎవరి సినిమా విడుదలవుతున్నా అక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటిది ఈ దీపావళికి ఈ ఇద్దరి సినిమాలు థియేటర్స్ కి వస్తున్నాయనగానే గట్టి పోటీ ఉంటుందని అంతా భావించారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య 'ఎన్జీకే' సినిమా చేస్తున్నాడు. ఇక మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ 'సర్కార్' సినిమా చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలను దీపావళికి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. కానీ సూర్య 'ఎన్జీకే' వెనక్కి తగ్గినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'ఎన్జీకే' భారీ సినిమా కావడంతో దీపావళి సమయానికి పనులు పూర్తి కావనీ, అందువలన విడుదల తేదీని వాయిదా వేసుకోవడం జరిగిందని కొంతమంది అంటున్నారు. సోలో రిలీజ్ మంచిదని సూర్య భావించడం వల్లనే దీపావళి బరి నుంచి ఆయన తప్పుకున్నాడనే అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.      

More Telugu News