varma: థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా 'భైరవగీత' .. ట్రైలర్ రిలీజ్ రేపే

  • వర్మ సమర్పకుడిగా 'భైరవగీత'
  • దర్శకుడిగా సిద్ధార్థ 
  • నిర్మాతగా అభిషేక్ నామా

   ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ .. నాగార్జున కాంబినేషన్లో 'ఆఫీసర్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తరువాత వర్మ నుంచి మరో సినిమా వస్తోంది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రానికి ఆయన దర్శకుడు కాదు .. సమర్పకుడు మాత్రమే.

సిద్ధార్థ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి రేపు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి రేపు ట్రైలర్ ను వదలనున్నట్టుగా వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమా కథాకథనాలు కొత్తగా ఉంటాయనీ, యూత్ ను ఆకట్టుకునే కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతోందని అంటున్నారు. ఇటీవల కొత్త కంటెంట్ తో వచ్చిన లవ్ స్టోరీస్ భారీ వసూళ్లను సాధించాయి. ఆ జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందేమో చూడాలి.  

More Telugu News