kumaraswamy: చంద్రబాబు నాయకత్వంలో పోరాటం చేస్తాం: కుమారస్వామి

  • చంద్రబాబు విజన్ కలిగిన నాయకుడు
  • 17 ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు
  • రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు

విజయవాడ పర్యటనలో ఉన్న కర్ణాటక సీఎం కుమారస్వామి ఏపీ ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఒక విజన్ కలిగిన నాయకుడని ఆయన ప్రశంసించారు. రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఆయన అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కితాబిచ్చారు. అమరావతి నిర్మాణం సజావుగా సాగాలని ఆకాంక్షించారు.

దేశంలోని 17 ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు సఫలమయ్యారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతామని తెలిపారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై చర్చించామని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీయేను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని కుమారస్వామి పిలుపునిచ్చారు. తామంతా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నామని... ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయం గురించి ఆలోచిస్తామని చెప్పారు. 

More Telugu News