rupee: కుప్పకూలుతున్న రూపాయి విలువ.. డాలర్ కు రూ.71కు చేరుకుని రికార్డు!

  • డాలర్ తో బలహీనపడుతున్న కరెన్సీ
  • వెంటాడుతున్న అమెరికా-చైనా వాణిజ్య యుద్దం
  • ముడిచమురు సెగతో నష్టపోతున్న రూపాయి

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడిచమురు ధరల్లో పెరుగుదల వెరసి రూపాయి పతనం కొనసాగుతోంది. తాజాగా డాలరుకు రూపాయి మారకం విలువ రూ.71కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు డిమాండ్ పెరగడంతో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముడిచమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది.

నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో రూ.70.74 వద్ద ముగిసిన రూపాయి విలువ తాజాగా మరో 26 పైసలు కోల్పోయి తొలిసారిగా రూ.71కు దిగజారి ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. చమురు సెగకు తోడు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం భయం, దేశంలో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్న వేళ రూపాయి పతనం ఈ రోజు కూడా కొనసాగింది. కాగా ప్రస్తుతం రూపాయి విలువ అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ కు రూ.70.94 వద్ద ట్రేడ్ అవుతుంది.

More Telugu News