karthikeya: 26 సెంటర్లు .. 50 రోజులు .. 'ఆర్ ఎక్స్ 100' విజయవిహారం

  • కార్తికేయ హీరోగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' 
  • యూత్ ను కట్టిపడేసిన కంటెంట్ 
  • చిన్న సినిమా సాధించిన పెద్ద విజయం

కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో 'ఆర్ ఎక్స్ 100' చిత్రం తెరకెక్కింది. జూలై 12వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించింది. యూత్ కి విపరీతంగా కనెక్ట్ కావడంతో అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కొత్త సినిమాలు చాలానే వచ్చినా, ఈ సినిమా వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

ఫలితంగా ఈ సినిమా నిన్నటితో 50 రోజులను పూర్తిచేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో 26 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకోవడం పట్ల ఈ సినిమా టీమ్ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తోంది. ఒక చిన్న సినిమా ఇన్నేసి థియేటర్స్ లో .. ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు అజయ్ భూపతికి .. హీరో కార్తికేయకి .. కథానాయిక పాయల్ రాజ్ పుత్ కి వరుస అవకాశాలు వస్తోన్న సంగతి తెలిసిందే.     

More Telugu News