YS JAGAN: పిలిపించి.. కొట్టి.. కేసులు పెడతారా?: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్

  • గుంటూరు సభకు మీరే పిలిచారు
  • మేనిఫెస్టోలో హామీలనే యువకులు అడిగారు
  • వెంటనే యువకులను విడుదల చేయండి

గుంటూరులో జరిగిన నారా హమారా-టీడీపీ హమారా సభ సందర్భంగా కొందరు ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టడంపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలను పిలిపించిన చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరిన యువకుల పట్ల పాశవికంగా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీ సభలో యువకులు కేవలం చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన ఉర్దూ మీడియం పాఠశాలల ఏర్పాటు, మదర్సాల విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు, స్కూల్ యూనిఫాం ఇవ్వకపోవడంపై మాత్రమే ప్లకార్డులు ప్రదర్శించారని జగన్ అన్నారు.

రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ముస్లింల తరఫున ఒక్క మంత్రి కూడా లేకపోవడాన్ని యువకులు ఎత్తిచూపారని జగన్ వ్యాఖ్యానించారు. దానికే 30 గంటల పాటు రహస్యంగా నిర్బంధించి, తీవ్రంగా హింసించి చివరికి కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమాయక యువకులపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించుకుని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News