Sachin Tendulkar: మరో ఆరు పరుగులు చేస్తే, సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ!

  • 120 ఇన్నింగ్స్ ల్లో సచిన్ 6 వేల పరుగులు
  • నేడు కోహ్లీ బ్యాటింగ్ చేస్తే, అది 119వ ఇన్నింగ్స్
  • సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ

టీమిండియా కెప్టెన్ మరో రికార్డుకు చేరువయ్యాడు. ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా, నాలుగో టెస్టు జరుగుతున్న వేళ, సచిన్ టెండూల్కర్ మరో రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.. ఈ మ్యాచ్ లో కోహ్లీ మరో ఆరు పరుగులు చేస్తే, టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

సచిన్ తన కెరీర్ లో 6 వేల పరుగుల మైలురాయిని చేరేందుకు 120 ఇన్నింగ్స్ తీసుకోగా, కోహ్లీకి నేటి మ్యాచ్ 119వ ఇన్నింగ్స్ అవుతుంది. అంటే, నేడు కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చి 6 పరుగులు చేస్తే, సచిన్ రికార్డు కనుమరుగవుతుంది. ఇప్పటివరకూ 69 టెస్టులాడిన కోహ్లీ, 118 ఇన్నింగ్స్ లో 5,994 పరుగులు చేశాడు. నేడు కోహ్లీ ఆరు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్ల జాబితాలో చేరుతాడని అభిమానులు భావిస్తున్నారు.

కాగా, టెస్టుల్లో 6 వేల పరుగులను అత్యంత త్వరగా పూర్తి చేసిన వారిలో సర్ డాన్ బ్రాడ్ మన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన కేవలం 68 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించారు.

More Telugu News