vikram: కమల్ సొంత బ్యానర్లో విక్రమ్ .. ఆయన జోడీగా అక్షరహాసన్

  • కమల్ సొంత బ్యానర్లో మరో మూవీ 
  • లాంఛనంగా మొదలైన షూటింగ్ 
  • ఒక కథానాయికగా అక్షర హాసన్

కమలహాసన్ గొప్ప నటుడు .. దర్శకుడు మాత్రమే కాదు .. భారీ చిత్రాల నిర్మాత కూడా. ఆయన సొంత బ్యానర్ 'రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్లో గతంలో ఎన్నో చిత్రాలు రూపొందాయి. ఆ సినిమాలు చాలావరకూ ఘన విజయాలను అందుకున్నాయి. అలాంటి కమల్ తాజాగా ఒక భారీ సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి.

పూజా కుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఆ సినిమాను ఈ రోజు ఉదయం లాంచ్ చేశారు. విక్రమ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా అక్షర హాసన్ చేయనుంది. మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి రాజేశ్ సెల్వ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.         

More Telugu News