kangana: 'మణికర్ణిక' విషయంలో మనస్పర్థలు?

  • హిందీలో రూపొందుతోన్న 'మణికర్ణిక'
  • దర్శకుడిగా వ్యవహరించిన క్రిష్ 
  • జనవరి 25వ తేదీన భారీ రిలీజ్  

ఒక వైపున కథానాయికగా కంగనా రనౌత్ సాధిస్తోన్న విజయాలను గురించే కాదు, మరో వైపున ఆమెకి సంబంధించిన వివాదాలను గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుకుంటూ వుంటారు. కంగనా రనౌత్ ను దగ్గర నుంచి చూసినవాళ్లు, అనుకున్నది సాధించే స్వభావం ఆమెది అని చెబుతారు. ఈ కారణంగానే తరచూ ఆమె చుట్టూ వివాదాలు అలముకుంటూ వుంటాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.'మణికర్ణిక' సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాడనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా క్లాప్ బోర్డుపై దర్శకురాలిగా కంగన పేరు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'మణికర్ణిక' విషయంలో కంగనతో మనస్పర్థలు వచ్చిన కారణంగానే, ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పనులను క్రిష్ పూర్తి చేయలేదనే టాక్ వుంది. ఆ కోపంతోనే ఆమె క్లాప్ బోర్డుపై దర్శకత్వం అనే చోట తన పేరు ఉండేలా చూసుకుందని అంటున్నారు. కంగన ఈ విధంగా వ్యవహరించడం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   

More Telugu News