హరికృష్ణ వద్ద పని చేస్తానని వచ్చిన డ్రైవర్... జాతకం చూసి షరతులు పెట్టడంతో వెనక్కు!

- స్వీయ డ్రైవింగ్ వద్దని సూచించిన వైద్యులు
- ఓ యువకుడిని డ్రైవర్ గా పంపిన బోధన్ టీడీపీ నేత
- జాతకం చూసి, స్థిరత్వం ఉండదని భావించిన హరికృష్ణ
- హరికృష్ణ పెట్టిన షరతులు నచ్చక వెళ్లిపోయిన యువకుడు
సదరు యువకుడి జాతకరీత్యా స్థిరత్వం ఉండదని భావించిన హరి, మరోసారి అతన్ని పిలిపించి, కొన్ని షరతులు విధించారట. అవి నచ్చకనే ఆ యువకుడు, హరికృష్ణ వద్ద డ్యూటీలో చేరలేదు. ఈ విషయాన్ని అమర్ నాథ్, మీడియాతో పంచుకుంటూ, అతన్ని పనిలో పెట్టుకున్నా, ఇప్పుడిలా జరిగి వుండేది కాదని వాపోయారు. హైవే ఎక్కినప్పుడు 100 కిలోమీటర్ల వేగాన్ని దాటరాదని, నగరంలో ప్రయాణిస్తుంటే 80 కిలోమీటర్ల కన్నా వేగంగా వెళ్లకూడదని హరికృష్ణ షరతులు పెట్టడంతో, ఆ యువకుడికి అవి నచ్చలేదని తెలుస్తోంది.