Hyderabad: 'మోదీ హత్యకు కుట్ర' కేసు.. వరవరరావును ఇంటివద్ద వదిలేసిన పోలీసులు!

  • హైదరాబాద్ కు తీసుకువచ్చిన అధికారులు
  • పుణెలో మోదీ హత్యకు కుట్రపై లేఖలు లభ్యం
  • మంగళవారం పౌరహక్కుల నేతల అరెస్ట్

మావోయిస్టులతో సంబంధాల కేసులో విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుతో పాటు పలువురు పౌర హక్కుల నేతలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేతలను వారిని పోలీసుల అదుపులో ఉంచరాదని, అవసరమైతే గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. ఈ నేపథ్యంలో వరవరరావును పుణె పోలీసులు ఈ రోజు హైదరాబాద్ కు తీసుకువచ్చారు.

ప్రధాని మోదీ హత్యకు మావోలు కుట్ర పన్నారనీ, దానికి వరవరరావు ఆర్థికసాయం చేస్తారన్నట్లు మహారాష్ట్రలో లేఖలు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం వరవరరావును అరెస్ట్ చేశారు. తాజాగా ఈ రోజు ఉదయం వరవరరావును హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు గాంధీ నగర్ లోని ఆయన ఇంట్లో వదిలిపెట్టారు.

More Telugu News