ఆ టిఫినేదో తొందరగా తిన్నా హరికృష్ణ బతికుండేవారు!

- కావలిలో వివాహనికి అనుచరులతో కలసి బయలుదేరిన హరికృష్ణ
- కారును తాను నడుపుతానన్న వెంకట్రావ్
- టిఫిన్ చేసిన తరువాత ఇస్తానన్న హరికృష్ణ.. అంతలోనే ప్రమాదం
వాస్తవానికి హరికృష్ణకు శస్త్ర చికిత్సలు జరిగినప్పటి నుంచి వాహనాలను నడపడం
లేదు. ఈ విషయం వెంకట్రావుకు, శివాజీకీ తెలుసు. దీంతో కారును తాను నడుపుతానని వెంకట్రావు కోరారు. ప్రస్తుతానికి తానే నడుపుతానని, టిఫిన్ కు ఎక్కడైనా ఆగి, చేసిన తరువాత, నువ్వు డ్రైవ్ చేద్దువులే అని హరికృష్ణ చెప్పారట. ఆపై గంట వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది. టిఫిన్ చేయడానికి ఆగుంటే హరికృష్ణ ప్రాణాలు నిలబడేవని నిన్నటి ఘటనను గుర్తు చేసుకుని విలపిస్తున్నారు ఆయన అనుచరులు.