Harikrishna: తనను తిరస్కరించిన చోటే ప్రజలతో పూల వర్షం కురిపించుకున్న హరికృష్ణ!

  • అన్న టీడీపీ పార్టీని పెట్టి గుడివాడ నుంచి పోటీ చేసిన హరికృష్ణ
  • కేవలం 6 వేల ఓట్లకే పరిమితం
  • 'లాహిరి లాహిరి లాహిరిలో' శతజయంతి ఉత్సవాలు గుడివాడలోనే
  • మూడు లారీల పూలను కురిపించిన ప్రజలు

అది 1999వ సంవత్సరం. ఎన్టీఆర్ నట వారసత్వంతో పాటు రాజకీయ వారసత్వాన్నీ సొంతం చేసుకున్న హరికృష్ణ, చంద్రబాబును విభేదించి, అన్న తెలుగుదేశం పార్టీని ప్రారంభించి, రాష్ట్ర వ్యాప్తంగా తన అభ్యర్థులను నిలిపారు. తాను స్వయంగా గుడివాడలో పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు చేదు అనుభవమే మిగిలింది. హరికృష్ణ కేవలం 6 వేల ఓట్లకు పరిమితమై, డిపాజిట్ ను కోల్పోయారు. హరికృష్ణ శిష్యుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన కొడాలి నాని, అప్పటి ఎన్నికల తరువాత హరికృష్ణకు అత్యంత సన్నిహితుల్లో ఒకడైపోయారు.

ఆపై కొన్నేళ్లకు తనను తిరస్కరించిన గుడివాడ ప్రజలతోనే బ్రహ్మరథం పట్టించుకునే రోజు వచ్చింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ ప్రధానపాత్రలో  నటించిన
'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ గుడివాడలో జరుగగా, మూడు లారీల పూలు తెచ్చిన అభిమానులు, ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించారు.

More Telugu News