mammootty: వైఎస్ వర్ధంతి సందర్భంగా 'యాత్ర' నుంచి లిరికల్ వీడియో

  • మహి.వి రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర'
  • 90 శాతం చిత్రీకరణ పూర్తి 
  • సంక్రాంతికి భారీ విడుదల  

దర్శకుడు మహి.వి రాఘవ్ .. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను 'యాత్ర' పేరుతో రూపొందిస్తున్నాడు. మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 90 శాతం వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ మమ్ముట్టి లుక్ మాత్రమే బయటికి వచ్చింది. ఆయన లుక్ వైఎస్ అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

వచ్చేనెల 2వ తేదీన వైఎస్ వర్ధంతి .. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 7 గంటలకి ఈ సినిమా నుంచి 'సమరశంఖం' అనే లిరికల్ వీడియోను విడుదల చేయనున్నారు. ఎమోషనల్ గా సాగే ఈ లిరికల్ వీడియోతో సినిమాపై భారీ అంచనాలు పెంచాలనే ఉద్దేశంతో వున్నారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. పాదయాత్ర నేపథ్యంలో ఈ పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.    

More Telugu News