ram: రామ్ సినిమా విషయంలో దిల్ రాజు తాజా నిర్ణయం!

  • రామ్ హీరోగా 'హలో గురు ప్రేమకోసమే'
  • రెండు హిట్స్ తరువాత త్రినాథరావు చేస్తోన్న మూవీ 
  • అక్టోబర్ 18వ తేదీన విడుదల    

రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'హలో గురూ ప్రేమకోసమే' చిత్రం రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. నిన్న మొన్నటి వరకూ 'శ్రీనివాస కళ్యాణం' సినిమాపై దృష్టి పెట్టిన దిల్ రాజు, ఆ సినిమా ఆశించినస్థాయి విజయాన్ని అందుకోకపోవడం వలన, నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా అయిన 'హలో గురూ ప్రేమకోసమే' చిత్రంపై దృష్టి పెట్టారు.తాజాగా ఎడిట్ సూట్ లో ఈ సినిమా చూసిన ఆయన, ఒకటి రెండు కీలకమైన సీన్స్ ను రీషూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ముందుగానే చెప్పారు. ఆ సమయానికి పనులన్నీ పూర్తయ్యేలా చూడమని త్రినాథరావుకి దిల్ రాజు చెప్పారట. 'సినిమా చూపిస్త మావా' .. 'నేను లోకల్' సినిమాలతో హిట్ కొట్టిన త్రినాథరావు, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.   

More Telugu News