Narendra Modi: మోదీకి రాఖీ కట్టేందుకు ఆధార్ తప్పనిసరా?: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఫొటో

  • సోషల్ మీడియాలో షేరింగ్
  • ఆధార్ తీసుకొచ్చి ప్రధానికి రాఖీకట్టిన యువతి
  • ఘటనపై వివరణ ఇచ్చిన అధికారులు

బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, మొబైల్ నంబర్లకు కొద్దిరోజుల క్రితం ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని కేంద్రం ఆదేశించినప్పుడు సోషల్ మీడియాలో జోకులు పేలిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని చాలామంది తీవ్రంగా నిరసించారు. తాజాగా రాఖీ పండుగ సందర్భంగా ప్రధానికి రాఖీ కట్టాలంటే ఆధార్ తీసుకురావాలని చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇందుకు అనుగుణంగా సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది.

అందులో పసుపుపచ్చ రంగు దస్తులు ధరించిన ఓ యువతి మోదీకి రాఖీ కడుతుండగా, ఆమె చేతిలో ఆధార్ కార్డు ఉంది. దీనిని ప్రధాని అధికార వెబ్ సైట్లతో పాటు పలు ప్రభుత్వ వెబ్ సైట్లు పోస్ట్ చేశాయి. దీంతో ఆధార్ కార్డు ఉన్నవాళ్లనే ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు అనుమతిస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

దీనిపై ప్రధాని కార్యాలయం ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. మోదీకి రాఖీ కట్టేందుకు ఆధార్ తప్పనిసరి కాదని ఆయన తెలిపారు. ప్రధానిని కలుసుకునేందుకు వచ్చే వ్యక్తులు ఏదైనా గుర్తింపు పత్రాన్ని లేదా డాక్యుమెంట్ ను సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఫొటోలో ఉన్న యువతి ఆధార్ కార్డును తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

More Telugu News