Harikrishna: నాన్న దగ్గరికి వెళితే జైల్లోకి వెళ్లినట్టే... హరికృష్ణ చిన్నతనం జ్ఞాపకాలు!

  • తండ్రి చెన్నైలో బిజీగా ఉన్న వేళ సర్వస్వమూ తాతయ్యే
  • తల్లీ తండ్రీ తానే అయ్యి హరికృష్ణను పెంచిన లక్ష్మయ్య చౌదరి
  • కేవలం చుట్టం చూపుగానే మద్రాసుకు హరికృష్ణ

ఎన్టీఆర్ చెన్నైలో సినిమాలతో బిజీగా ఉన్న వేళ హరికృష్ణ, తన తాతయ్య లక్ష్మయ్య చౌదరి వద్దే ఉంటూ, నిమ్మకూరులో పెరిగారు. తనకు ఇష్టమైనట్టుగా, ఎంతో సరదాగా బాల్యం గడచిపోయిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్న హరికృష్ణ, ఆ సమయంలో తండ్రి వద్దకు వెళితే, జైలుకు వెళ్లినట్టుగానే అనుకునేవాడినని చెప్పారు. తనకు తల్లీ, తండ్రీ అన్నీ తాతయ్యేనని, మద్రాసుకు కేవలం చుట్టం చూపుగా వెళ్లి, తండ్రి దగ్గర నాలుగు రోజులుండి వచ్చే వాడినని అన్నారు. ఆ నాలుగైదు రోజులు కూడా, ఎప్పుడెప్పుడు వెళ్లిపోతామా? అన్నట్టుగా ఉండేదని అన్నారు. పల్లెటూరులోని గాలి, ఆ పచ్చటి వాతావరణం, పొలాలు తనకెంతో ఇష్టమని చెప్పారు.

More Telugu News