hari krishna: అన్నయ్య హరికృష్ణ లేరంటే నమ్మబుద్ధి కావడం లేదు: నందమూరి బాలకృష్ణ

  • మా కుటుంబానికే కాదు పార్టీకీ తీరని లోటు
  • ఆయనకు బంధుప్రీతి ఎక్కువ
  • పార్టీలో కూడా అందరిని కలుపుకుపోయేవారు

అన్నయ్య హరికృష్ణ లేకపోవడం తనకు, తమ కుటుంబానికే కాదు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు. మెహిదీపట్నంలో హరికృష్ణ భౌతికకాయం ఉంచిన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, హరికృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధకరమని అన్నారు. హరికృష్ణకు బంధుప్రీతి ఎక్కువని, మా ఊరు వెళ్లినప్పుడు ప్రతిఒక్క బంధువును కలిసి, పలకరించేవారని అన్నారు. అలాగే, పార్టీలో కూడా అందరితో కలుపుగోలుతనంగా ఉండేవారని, అటువంటి ఆయన లేరంటే నమ్మబుద్ధి కావడం లేదని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు.

సంస్కృతీ సంప్రదాయాలకు హరికృష్ణ విలువ నిచ్చేవారని, తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు వస్తుండేవారని, హరికృష్ణని చూస్తుంటే తండ్రిని చూస్తున్నట్టే ఉండేదని అన్నారు. అందరూ పోవాల్సిన వాళ్లేమని, కానీ, ఈ విధంగా చనిపోవడం బాధాకరంగా ఉందని, నమ్మబుద్ధి కావడంలేదని బాధాతప్త హృదయంతో బాలకృష్ణ చెప్పారు.

More Telugu News