హరికృష్ణకు తెలుగుదేశం పార్టీలో ఓ ప్రత్యేకత ఉంది!: సీఎం చంద్రబాబు

- హరికృష్ణకు తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకత ఉంది
- ఏ పదవిలో ఉన్నా నీతి, నిజాయతీగా పని చేశారు
- అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు
వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం హరికృష్ణ నైజమని, హరికృష్ణకు తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకత ఉందని, ఆయన ఏ పదవిలో ఉన్నా నీతి, నిజాయతీగా పని చేశారని కొనియాడారు. అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని, హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు అన్నారు.